లస్ట్ స్టోరీస్ లో కియారా అద్వానీ భావ ప్రాప్తి సీన్ ఓ రేంజ్ లో నెట్ లో వైరల్ అయ్యింది. ఇదే విషయం మీద కియారా చాలా సార్లు స్పందించింది. ఇటీవల కియారా మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్‌లోని కీలక విషయాలను వెల్లడించారు. నా సినీ కెరీర్ ఈ రేంజ్‌లో ఉందంటే.. అందుకు కారణం బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్. ఆయనను నేను గురువుగా భావిస్తాను. అద్భుతమైన పాత్రలు ఇచ్చిన నా కెరీర్‌ను మలుపుతిప్పారు.


అతను ఏదైనా సలహా ఇస్తే.. చాలా సీరియస్‌గా ఆలోచిస్తాను. దానిని పాటిస్తాను కూడా. అతను చెప్పేది నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తాను. నచ్చలేదని చెబితే సానుకూలంగా వింటాడు. అతనిలో ఇగో లేకపోవడం నాకు బాగా నచ్చింది అని కియారా అన్నారు. లస్ట్ స్టోరీస్‌ అనే వెబ్ సీరిస్‌లో హస్తప్రయోగం సీన్ వివాదం కావడంపై స్పందించారు. స్క్రిప్టు డిమాండ్ మేరకు చాలా నిజాయితీగా చేయాల్సి వచ్చింది.


ఆ సీన్ చెప్పినప్పుడు నాకు ఎలాంటి ఆందోళన కలుగలేదు. కరణ్ జోహర్ ఆ సీన్ ఎంత సృజనాత్మకంగా తీస్తాడో అనే విషయం నాకు తెలుసు కాబట్టి పెద్దగా దాని గురించి ఆలోచించలేదు. తెర మీద హస్త ప్రయోగం సీన్ చూసినప్పుడు వల్గర్‌గా అనిపించలేదు అని కియారా తెలిపారు. లస్ట్ స్టోరిస్‌లో అమాయకత్వంతో కూడిన పాత్రపై సానుభూతి పెరిగింది. అందుకే హస్త ప్రయోగం సీన్‌లో అశ్లీలత ఏదీ కనిపించలేదు. ఒకవేళ ఆ సీన్ నచ్చకపోతే సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా వచ్చేవి. కానీ ఇప్పటి వరకు అలాంటివి కనిపించలేదు. ఈ సీన్ చేయడానికి ముందు నా తల్లిదండ్రులకు చెప్పాను. ఎందుకంటే హఠాత్తుగా చూసి వాళ్లు షాక్ తినకూడదని అంతా చెప్పేశాను అని కియారా వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: