పవన్ కళ్యాణ్ తో ‘కాటమరాయుడు’ మూవీలో నటించిన తువాత శ్రుతి హాసన్ మరి ఏసినిమాలోను నటించలేదు. తన బ్రిటీష్ ప్రేమికుడుతో లవ్ బ్రేకప్ అయిన తరువాత శృతి హాసన్ తిరిగి సినిమాల పై మనసు పెట్టింది. ఇలాంటి పరిస్తుతులలోనే కొరటాల శివ దృష్టి శృతి పై పడి ఆమెను చిరంజీవితో తీయబోతున్న మూవీకి హీరోయిన్ గా అనుకోవడం దానికి చిరంజీవి ఓకె చెప్పడం అన్నీ స్పీడ్ గా జరిగిపోయాయి.

అయితే శృతి హాసన్ విషయంలో మొదట్లో ఓకె చెప్పిన చిరంజీవికి ఇప్పుడు ఆమె విషయంలో కొన్ని సందేహాలు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి పక్కన రొమాంటిక్ సీన్స్ లో శృతి సరిగ్గా మ్యాచ్ అవ్వదు అంటూ కొందరు చిరంజీవి సన్నిహితులు మెగా స్టార్ కు సలహా ఇస్తున్నట్లు టాక్.

ఈ సూచనలు కొరటాల శివ దృష్టి వరకు వచ్చినా కొరటాలకు ‘శ్రీమంతుడు’ సినిమా నుండి శృతితో ఏర్పడిన సాన్నిహిత్యం రీత్యా ఆమెను ఎంపిక చేసే విషయంలో మరొక ఆలోచన పెట్టుకోవద్దని కొరటాల చిరంజీవి పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. దీనితో కొరటాల ఒత్తిడి కాదనలేక తనకు కొందరు ఇస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకోనలేక శ్రుతి హాసన్ కంటే బెటర్ ఆప్క్షన్ మరేదైనా ఉంటుందా అన్న ఆలోచలు కూడ ప్రస్తుతం చిరంజీవి మైండ్ లో ఉన్నాయి అని అంటున్నారు.

ఈ విషయాలు అన్నీ శృతి దృష్టి వరకు రావడంతో ఆమె ఒకవైపు చిరంజీవి సినిమా గురించి ఎదురు చూస్తూనే మరొకవైపు ఇప్పుడు రవితేజా సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం త్వరలో ఠాగూర్ మధు త్వరలో రావితేజాతో తీయబోతున్న మరో మూవీకి శృతి 1.5 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ దర్శకుడు గోపీ చంద్ మలినేని చెప్పిన కథకు ఓకె చేసినట్లు టాక్. దీనితో శృతి చిరంజీవితో సినిమాలు చేస్తూనే రవితేజ సినిమాను చాల తెలివిగా లైన్ లో పెట్టుకుంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: