టైటిల్ చూడగానే ముందుగా అందరికి ఒకటే అనుమానం కలుగుతుంది, నాగార్జున సినిమాకు మహేష్ బాబు హిట్ ఇవ్వడం ఏంటా అని. అయితే అందులో ఒక అంతరార్ధం ఉంది, అదేమిటంటే యువసామ్రాట్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ మన్మధుడు-2 టీజర్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదలై మంచి వ్యూస్ తో దూసుకెలుతున్న విషయం తెలిసిందే. 

ఇక ఈ సినిమాను ఆగష్టు 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్, టీజర్ లో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఆ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడం. ఇక ఆ రోజున మరొక ప్రక్కన మహేష్ ఫ్యాన్స్ హడావుడి కూడా ఉంటుంది, అందులోను ఇదివరకు మహేష్ సినిమాలపై నాగ్, అలానే నాగ్ సినిమాలపై మహేష్ తమ వంతుగా ప్రసంశలు కురిపించిన ఘటనలు చూసాము. ఇక ప్రస్తుతం తన పుట్టినరోజున విడుదల కాబోతున్న నాగార్జున సినిమాకు మహేష్ బాబు ఏ మాత్రం ఒక ట్వీట్ తో చిన్న బూస్ట్ ఇచ్చినా చాలు ఆ సినిమాకు అది కొంతవరకు హెల్ప్ అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

అలా అని వారు నాగార్జునను తక్కువ చేయడం లేదు, అయితే ఒక స్టార్ హీరో సినిమాకు, మరొక స్టార్ హీరో తనవంతుగా పాజిటివ్ గా మద్దతు ఇస్తే అది ఆ సినిమాకు కొంత లాభాన్ని చేకూర్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా యువసామ్రాట్ సినిమాకు మహేష్ బాబు ఏమైనా హెల్ప్ అవుతారేమో తెలియాలి అంటే మన్మధుడు-2 విడుదల రోజు వరకు వేచి చూడాల్సిందే. నిజానికి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన తరువాతనే అది సూపర్ స్టార్ పుట్టిన తేదీ కావడంతో ఇప్పుడు మన్మధుడు-2 తో మహేష్ బాబుకు లింక్ పెట్టి కొన్ని వార్తలు ప్రచారం చేస్తున్నాయి మీడియా వర్గాలు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: