అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంటే ముందు నుంచి రొమాంటిక్ హీరోలు అని అంటారు. అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో ప్రేమ కథాచిత్రాల్లో నటించారు. అప్పట్లో ఆయనను రొమాంటిక్ హీరో అనేవారు..ఆ తరహా పాత్రలతో నటించి మెప్పించారు. అప్పట్లో అక్కినేని స్టెప్పులంటే యూత్ కి మంచి క్రేజ్ ఉండేది. ఆయన వారసుడిగా అక్కినేని నాగార్జున ‘విక్రమ్’సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో రొమాంటిక్ సినిమాల్లో నటించారు.
2002 లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ‘మన్మధుడు’సినిమాలో నాగార్జున నిజంగా మన్మధుడే అనిపించేలా నటించాడు. రొమాన్స్, ఎమెషన్స్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ తో ఈ సినిమా అప్పట్లో దుమ్మురేపింది. నాగార్జున కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా సీక్వెల్ తీయాలనే ఆలోచన నాగార్జునలో వచ్చినా..అది సెట్స్ పైకి వెళ్లలేదు. చాలా కాలం తర్వాత ఈ సినిమా సీక్వెల్ వెండి తెరపై ఆవిష్కరిస్తున్నారు.
రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో నాగార్జున, రకూల్ ప్రీత్ సింగ్ నటించిన ‘మన్మధుడు 2’షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో నాగార్జున లుక్ పరంగా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇంతకు ముందు రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో మన్మథుడుగా అమ్మాయిలతో రొమాన్స్ పండిస్తూ లిప్ లాక్ ముద్దులతో ముంచెత్తుతున్నాడు.
60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా నాగార్జున మాత్రం నవమన్మథుడిగానే ఉన్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ దేవదర్శిని తదితరులు ఈ చిత్రంలో నటించారు.