మన్మథుడు2 చిత్రం గురించి చిత్రబృంధం చెప్పినట్లుగా గురువారం మధ్యాహ్నం టీజర్ ని విడుదల చేశారు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌లపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. టీజర్‌లో నాగార్జున రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు.


విదేశాల్లో ఉండే హ్యాపీ ఫ్యామిలీ నాగార్జునది. ఏవో కారణాల వల్ల పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవడంతో మధ్య వయసు దాటిపోతుంది. దీంతో అక్క-అమ్మతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ఇప్పటికైనా ఆ సంగతి చూడమని ఒత్తిడి చేస్తారు. ఆఫీస్ వాళ్ళు బంధు మిత్రులు ఈ వయసులో పెళ్ళా అని షాకవుతున్నా పట్టించుకోకుండా లేట్ ఏజ్ లవ్ అండ్ రొమాన్స్ కు రెడీ అవుతాడు. అప్పుడే అతనిలోని అసలైన మన్మధుడు బయటికి వస్తాడు. తన మార్కు అల్లరి స్టార్ట్ చేస్తాడు. నేను ప్రేమలో పడను ప్రేమను పుట్టిస్తాను అనే సిద్ధాంతంతో కొత్త థియరీ చెబుతాడు. ఇది అతని గతమా లేక పెళ్లి చేసుకుందామని ఆలోచన వచ్చాక జరిగిన రొమాన్సా తెరమీదే చూడాలి. రకుల్ తో లవ్ ట్రాక్ కూడా ఇందులో భాగమే


ఇది ఈయనకొక్కడికే సాధ్యమేమో అనిపించేలా ఉన్నాడు. లేట్ ఏజ్ మ్యారేజ్ ని థీమ్ గా తీసుకుని దాని చుట్టూ కామెడీ అల్లే ప్రయత్నం చేశాడు రాహుల్ రవీంద్రన్. ఎండిపోయిన చెట్టుతో నాగార్జునని పోల్చడం-కోచింగ్ ఇచ్చే వయసులో బ్యాటింగ్ అవసరమా అంటూ వ్యంగ్యంగా కామెడీ చేయడం-లక్ష్మి గారి పాత్రతో నాగ్ ని వర్జినే కదా అని ప్రశ్నించడం అంతా బోల్డ్ గా ఈగోలకు తావివ్వకుండా చూపించడం విశేషం.

కొన్ని క్యుట్ హాట్ సీన్స్ కూడా ఉన్నాయండోయ్. 
రావు రమేష్-ఝాన్సీ-వెన్నెల కిషోర్ లాంటి' కీలక పాత్రలను రివీల్ చేశారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ న్యాచురల్ గా ఉంది. ఎం సుకుమార్ ఛాయాగ్రహణం కిట్టు విస్సాప్రగడ సంభాషణలలో కామెడీ టైమింగ్ మొత్తానికి మన్మధుడు 2 మీద అంచనాలు పెంచేశాయి. ఆగస్ట్ 9 రిలీజ్ డేట్ లాక్ చేస్తూ టీజర్ చివర్లో అధికారికంగా ప్రకటించేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: