తెలుగు ఇండస్ట్రీలో ‘ఈశ్వర్’చిత్రంతో హీరోగా పరిచయం అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత వచ్చిన చిత్రాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. రాజమౌళి దర్శకత్వంలో ‘చత్రపతి’లాంటి యాక్షన్ ఎంట్రటైన్ మెంట్ తో ప్రభాస్ జాతకమే మారిపోయింది. అప్పటి నుంచి ప్రభాస్ నటిస్తున్న చిత్రాలపై అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి.  డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చిలాంటి చిత్రాలు వరుసగా హిట్స్ గా నిలిచాయి.

మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి, బాహుబలి2’చిత్రాలు ప్రభాస్ కెరీర్ లో మరుపురాని చిత్రాలుగా నిలిచిపోయాయి.  అంతే కాదు ప్రభాస్ ని జాతీయ స్థాయి నటుడిగా నిలిపాయి.  అయితే అప్పట్లోభారీ బడ్జెట్ తో నిర్మించిన ‘బిల్లా’ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది.   తమిళంలో అజిత్ నటించిన ‘బిల్లా’తెలుగు లో ప్రభాస్ నటించారు.  ఈ చిత్రం ఒకప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ నటించిన ‘డాన్’చిత్రాన్ని పోలి ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు లో వచ్చిన ‘బిల్లా’లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. 

ఇక బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహూ’.  రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ రోజు ‘సాహూ’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ అనిపించినా..ఒకప్పుడు ‘బిల్లా’ చిత్రాన్ని గుర్తు చేసే విధంగా కనిపిస్తుంది.  కాకపోతే బిల్లా సమయానికి ప్రభాస్ కి ఇంతగా గుర్తింపు లేదు..మరి ‘సాహూ’ చిత్రం ఎంత వరకు హిట్ అవుతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: