నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా టీజర్ పై అన్ని చోట్ల మరియు అన్ని సినిమా ఇండస్ట్రీల నుండి ప్రేక్షకులు విపరీతంగా పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు కొందరు సినిమా ప్రముఖులు సైతం ట్రైలర్ అద్భుతంగా వుంది, సినిమా ఎప్పుడు చూస్తామా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాము అంటూ తమ మీడియా మాధ్యమాల్లో పోస్ట్స్ చేస్తున్నారు. అయితే అందరి అంచనాలను అందుకున్న సాహో టీజర్, రేపు సినిమా విడుదల తరువాత ఆ స్థాయిని అందుకుంటుందా అనేది ప్రస్తుతం సినిమా వర్గాల్లో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. 

బాహుబలి అనేది ఒక పెరియాడికల్ ఫిలిం కాబట్టి బాగా ఆడింది, అదీ కాక దర్శకధీరుడుగా పేరుగాంచిన రాజమౌళిని వేరొకరితో కంపేర్ చేయలేమని, మరి ఆ సినిమా నెలకొల్పిన రికార్డులను, అదే హైప్ మరియు క్రేజ్ తో రాబోతున్న ఈ సాహో సినిమా ఎంతవరకు అందుకుంటుంది అనే దానిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. కొందరు మాత్రం సాహో కు అది సాధ్యమే అంటుంటే మరికొందరు మాత్రం కొంత మేర కష్టమే అంటున్నారు. నిజానికి బాహుబలి రెండు భాగాలూ విడుదల సమయంలో ఎంతో హైప్ క్రియేట్ చేసాయి, అలానే విడుదల పరంగా కూడా ఎంతో భారీ ఎత్తున ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా రెండు భాగాలకు దాదాపుగా అన్ని చోట్ల నుండి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ రావడంతో ఆ రెండు సినిమాలు ఊహించిన దానికంటే అత్యద్భుతమైన విజయాన్ని అందుకుని భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టాయి. అయితే సాహోకు అటువంటి పరిస్థితులు ఎంతవరకు కలిసివస్తాయి అని, 

అదీకాక అంతకముందు కేవలం ఒకేఒక్క సినిమా అనుభవం కలిగిన సుజిత్ ఈ సినిమాని అందరిని ఆకట్టుకునేలా తీయగలడా అనేదానిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సాహోకు ప్రస్తుతం వస్తున్న హైప్ ని బట్టి రేపు సినిమాను విడుదల పరంగా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం జరుగుతుందని, అయితే అందరూ భావిస్తున్నట్లు ఒక సూపర్ హిట్ సినిమాకు కావలసిన స్టఫ్ ని దర్శకుడు సుజిత్ ఇవ్వగలడా లేదా అనేది మాత్రం సినిమా చూసేవరకు చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రేపు విడుదల తరువాత సాహో ఏ మాత్రం మంచి టాక్ సంపాదించినా చాలా చోట్ల బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: