ఏ సినిమా మీద నైనా జక్కన్న రివ్యూ ఇస్తే ఆ ఆ సినిమా రేంజ్ ఎక్కడికో పోతుంది.  బాహుబలితో ప్రభాస్ రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లిన రాజమౌళి సాహో గురించి ఏమైనా చెబుతాడా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు సమాధానం జస్ట్ కొన్ని నిమిషాల్లోనే వచ్చేసింది. యువి సంస్థ బడ్జెట్ కు న్యాయం చేసింది సుజీత్ దర్శకత్వానికి న్యాయం చేశాడు ప్రభాస్ మాచోనే కాదు డార్లింగ్ కూడా అంటూ ప్రశంసల వర్షం కురిపించేశాడు.


ఇంకేముంది ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. వాస్తవానికి రాజమౌళి ఈ మధ్య ఏ సినిమా గురించి అదే పనిగా ట్వీట్ చేయడం లేదు. తనకు ఎంత కావాల్సిన వారైనా సరే రివ్యూలకు దూరంగా ఉంటున్నాడు. కానీ సాహో ఇచ్చిన టెంప్టేషన్ ఆపలేకపోయింది. ఇలా ట్వీట్ పెట్టేశాడు. సాహో అవుట్ ఫుట్ మీద ఆగస్ట్ లో విడుదలయ్యాక వచ్చే ఫలితం మీద జక్కన్నకు చాలా ఆసక్తి ఉండే ఉంటుంది.


ఎందుకంటే ఒకవేళ సాహో కనక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతే దాన్ని మించే స్థాయిలో ఆర్ఆర్ఆర్ ని ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. అందుకే సాహో మీద చరణ్ తారక్ ఫ్యాన్స్ కూడా  గట్టిగానే లుక్ వేస్తున్నారు. ఆయితే టీజర్ తోనే ఇంత సంచలనం రేపిన సాహో రేపు సినిమా విడుదల అయిన తరువాత ఎన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: