తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి తెరకెక్కించారు ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాలు.  మిర్చి చిత్రంతో మంచి ఊపులో ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘చత్రపతి’తర్వాత రాజమౌళితో మరోసారి రంగంలోకి దిగారు.  ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి తీసిన ఈ చిత్రాలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించాయి. 

అప్పటి వరకు బాలీవుడ్ లో ఉన్న రికార్డులు తిరగరాశాయి. బాహుబలి 2 చిత్రం తర్వాత ప్రభాస్ కి జాతీయ స్థాయిలో పేరు రావడంతో ఆయన తదుపరి చిత్రాలపై కూడా అదే స్థాయి అంచనాలు పెరిగిపోయాయి.  తాజాగా సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్న ‘సాహూ’ చిత్రం టీజర్ నేడు రిలీజ్ అయ్యింది. 

మొన్నటి వరకు ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతుందని..హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెగ వార్తలు వచ్చాయి..అయితే ఆ స్థాయి నిజంగానే అందుకుంటుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. తాజాగా టీజర్ చూసిన తర్వాత తమ అంచనాలు నిజమే అంటున్నారు ప్రేక్షకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: