ఇండియాస్ బిగ్గెస్ట్ ఆక్షన్ థ్రిల్లర్ అని కీర్తించబటుతున్న ‘సాహో’ టీజర్ రానే వచ్చింది. అనుకున్నట్లే ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడని యాక్షన్ సన్నివేశాలను, పెద్ద బడ్జెట్ తో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ తో, అత్యాధునిక టెక్నాలజీ తో రూపొందించిన ఈ సినిమా టీజర్ చూస్తే ఎట్టకేలకు హాలీవుడ్ ఆక్షన్ థ్రిల్లెర్స్ అన్నిటికి సమాధానం అనే అనిపిస్తోంది. 1 నిమిషం 39 సెకన్ల టీజర్ లో ఒకే సారి నాలుగు ఐదు ఆక్షన్ మూవీస్ చుసిన ఫీల్ వస్తుంది.


చివర్లో ప్రభాస్ హల్క్ అవతారంలో కనిపించిన ఒక షాట్.. ‘ఫ్యాన్స్.. డైహార్డ్ ఫ్యాన్స్’ అనే డైలాగ్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాయి. కథ పరంగా మేకర్స్ ఏమి మనకి చెప్పకపోయినా, విజువల్స్.. యాక్షన్ సన్నివేశాలని మేక్స్ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. 


అంతా బనే ఉంది కానీ, ఒక్క విషయం లో ఇంకా క్లారిటీ లేదు అంటున్నారు అభిమానులు.. ‘సాహో’ మ్యూజిక్ విషయంలో నెలకొన్న సస్పెన్సుకి టీజర్‌తో అయినా ముగుస్తుంది అనుకుంటే ఉన్న సస్పెన్స్ ఇంకా ఎక్కువ అయ్యింది. టీజర్ చివర్లో ఇచ్చిన క్రెడిట్స్‌లో చాలామంది టెక్నీషియన్ల పేర్లు ఉన్న ఎక్కడా సంగీత దర్శకుడి పేరు లేదు. 


టీజర్ కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే, అది అదిరిపోయే బాక్గ్రౌండ్ మ్యూజిక్ వాల్ల కూడా. కానీ, క్రెడిట్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ పేరు లేకపోవడం కొసమెరుపు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ‘సాహో’ ఛాప్టర్-2 వీడియోకు గిబ్రాన్ మ్యూజిక్ ని అందించాడు. కానీ ఇప్పుడు మాత్రం అతని పేరు లేదు. శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకున్నాక సినిమా మొత్తం మ్యూజిక్ బాధ్యతలు అతడికి అప్పగించినట్లు వార్తలొచ్చాయి. కానీ టీజర్లో క్రెడిట్ ఇవ్వలేదంటే ఇప్పుడు పాటలకి మ్యూజిక్ ఎవరు అందిస్తారు, థియేటర్స్ కి వచ్చాక మ్యూజిక్ డైరెక్టర్ కొలం లో ఎవరి పేరు ఉండబోతోంది అన్నదే సస్పెన్స్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: