కింగ్ నాగార్జున ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి 17 ఏళ్ల తరువాత సీక్వెల్ వచ్చింది. ‘మన్మథుడు 2’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు నాగార్జున. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకోవడంతో నేడు (జూన్ 13) ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 


ముదురు వయసులో ఉన్న నాగార్జున పెళ్లి చుట్టూ కథను అల్లి చాలా కామెడీగా చూపించారు. ఇంత వయసు వచ్చినా ఆయన ఇంకా వర్జిన్‌గానే ఉండటం.. చుట్టూ ఉన్న వాళ్లు ఆయన్ని ఆటపట్టించడం చాలా ఫన్నీగా చూపించారు. ఇది టీజర్ ఫస్ట్ పార్ట్‌‌లో మాత్రమే. ఇక సెకండ్ పార్ట్‌లో మన్మథుడుగా ఒరిజినల్ అవతారంలోకి వచ్చేసి అమ్మాయిలతో రొమాన్స్ పండిస్తూ ముద్దులతో ముంచెత్తుతున్నాడు. 60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా నాగార్జున మాత్రం నవమన్మథుడిగానే ఉన్నారు. 


ఇది ఇలా ఉండగా, టీజర్ కి రెస్పాన్స్ మాత్రం కొంచెం అటు ఇటు గా వస్తోంది, అక్కినేని అభిమానులు బ్లాక్బస్టర్ ఖాయం అంటుండగా, కొంతమంది, 17 ఎల్లా ముందు వచ్చి నవ్వించి, ఏడిపించి, ఒక మంచి రోమాంసిటిక్ కామెడీ ని అందించిన మన్మధుడితో ఈ టీజర్ ని పోలుస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ కామెడీ సన్నివేశాలు ఆశించి వస్తే, ఈ వర్జిన్ గోల ఏంటి అని ఫిమేల్ ఫ్యాన్స్ రియాక్షన్.  ఈ మధ్య సినిమాలన్నీ బోల్డ్ గా ఉండటం తో, నాగార్జున కూడా ఈ బోల్డ్ స్టెప్ తీసుకున్నారని అందరి ఫీలింగ్. మరి చూడాలి, ఈ బోల్డ్ స్టెప్ కి బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రియాక్షన్ వస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: