అతి చిన్న వయసులోనే సినిమా సంగీతాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ లెవెల్ లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనకోడలు వెండితెరకు పరిచయం కాబోతోంది. 'జివి భవాని శ్రే'  తన పేరు. అంతేకాదు కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ కు స్వయానా చెల్లెలు ఈ అమ్మాయి. విజయ్ సేతుపతి నటిస్తున్న 'కాపే రణసింగం' లో భవానికి ఓ కీలక పాత్ర ఆఫర్ చేశారట. అయితే తను హీరోయినా లేక సెకండ్ లీడా అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. 


ఎందుకంటే ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో నటిస్తుంది కాబట్టి ఆ విషయంలో క్లారిటీ లేదు. ఇక భవానికి నటన కొత్త కాదు. రీసెంట్‌గా అక్కినేని నాగార్జున సతీమణి సీనియర్ నటి అమల నటించిన వెబ్ సిరీస్ 'హై ప్రీస్టెస్' లో ఓ కీలక పాత్ర చేసింది. అది సినిమా కాకపోవడంతో జనానికి అంతగా రీచ్ కాలేదు. ఇప్పుడీ భవాని ఎంట్రీ పట్ల రెహమాన్.. రవిచందర్ ఫ్యామిలీస్ బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నారని కోలీవుడ్ సమాచారం.  


నిజానికి భవానీ సినిమా ఎంట్రీ గుట్టుచప్పుడు కాకుండా దాచి పెద్దగా ప్రచారం లేకుండా చేయాలి అనుకున్నప్పటికీ చెన్నై మీడియాలో లీకైపోయి మొత్తం తెలిసిపోయింది. ఇక భవాని అందం చూస్తుంటే హీరోయిన్ గా సెటిలయ్యే కళ గ్లామర్ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి రెహమాన్ అనుకుంటున్నట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా సెటిల్ అవుతుందా లేదా అనేది రెండు సినిమాలు రిలీజైతే గాని చెప్పడం కష్టం. ఇక ఇండస్ట్రీలో తమ వారసులు దండయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: