గత దశాబ్ద కాలంగా తమిళంలో వచ్చిన బెస్ట్ యాక్టర్ అంటే .... విజయ్ సేతుపతి అని చెప్పొచ్చు. ముందు నెగిటివ్, క్యారెక్టర్ రోల్స్ చేసిన అతను.... పిజ్జా సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత అతను చేసిన ప్రతి పాత్రా ప్రేక్షకులని మెప్పించింది. విజయ్ సినిమాల ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ, నటుడిగా మాత్రం అతనెప్పుడూ ఫెయిల్ అవలేదు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ... చాలా తక్కువ సమయంలో నటుడిగా గొప్ప స్థాయిని అందుకున్నాడు.


ఏ బిల్డప్ లేకుండా.... చాలా సాధారణంగా కనిపించే పాత్రల్లో కూడా తనదైన నటనతో బలమైన ముద్ర వేయడం అయన ప్రత్యేకత. తెలుగులో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహా రెడ్డి లో అతను కీలకపాత్రలో నటించారు. దాంతో పాటు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.


ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా మధ్య వయస్కుడి పాత్రలో విజయ్ కనిపంచనున్నాడు. విజయ్ కి వయసు మరి ఎక్కువేమీ అయిపోలేదు. ఇంకా 40వ పదికి కూడా చేరుకోలేదు. ఓ వైపు తమిళంలో హీరో పాత్రలు చేస్తూనే, తెలుగులో ఇప్పుడిప్పుడే తోలి అడుగులు వేస్తున్న అతను తండ్రి పాత్ర ఒప్పుకోవడం విశేషమే. ఓ వైపు 60 ఏళ్ల హీరోలు పడుచు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు.


నడి వయసు పాత్రలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. కానీ విజయ్ మాత్రం పాత్ర నచ్చాలే కానీ ఇంకేమీ చూసుకోడు. తమిళంలో ఈ మధ్యే విడుదలైన ‘సూపర్ డీలక్స్’లో అతను హిజ్రా పాత్ర చేయడం విశేషం. అతడికున్న ఇమేజ్‌కి అలాంటి పాత్రలో చూస్తే షాకవడం ఖాయం. ఈ నటుడిని చూసి మన హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉందనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: