‘జనసేన’ ఘోర పరాజయానికి సంబంధించి సమీక్షా సమావేశాలు పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు మరొక కొత్త సమస్య వచ్చి పడినట్లు తెలుస్తోంది. అందుతున్న వార్తల ప్రకారం జూలై మొదటి వారంలో అమెరికాలోని వాషింగ్టన్ లో జరగబోతున్న తానా మహాసభలకు అతిధిగా రావలసిందిగా పవన్ కు ఆహ్వానం అందినట్లు సమాచారం.

ఈ ఆహ్వానాన్ని మన్నించి అమెరికా వెళ్ళి అక్కడ తెలుగువారు అడిగే రకరకాల ప్రశ్నలకు తన వద్ద సరైన సమాధానాలు ఉన్నాయా అన్న విషయమై పవన్ ఆలోచనలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితులలో పార్టీని బతికించాలి అంటే ఎన్నారైల సహాయం అవసరం కాబట్టి అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని పవన్ సన్నిహితులు సూచిస్తున్నట్లు టాక్.

తానా సంస్థలోని చాలామంది సభ్యులు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు కావడంతో ఈ సమావేశానికి వెళ్ళితే ఇప్పటికే తన పై పడ్డ తెలుగుదేశం సానుభూతి కార్డ్ మరింత బలపడుతుందా అన్న సందేహాలు కూడ పవన్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఒక పత్రికను స్థాపించే ఆలోచనలు చేయడంతో పాటు తన సన్నిహితుడు ప్రారంభించిన ‘99’ ఛానల్ కష్టాలు గట్టెక్కాలి అంటే వాటికి ఎవరో ఒకరి సహాయం కావాలి కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని పవన్ పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం.

మరో రెండు రోజులలో పవన్ తానా మహాసభలకు వెళ్ళే విషయమై క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. పవన్ వ్యక్తిగతంగా కూడ ఓడిపోయినా తానా లాంటి సంస్థ నిర్వహించే మహాసభలకు పవన్ ను అతిధిగా ఆహ్వానించడంతో అతడి అభిమానులకు ఒక జోష్ ను ఇచ్చే అంశంగా మారుతుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని మెగా కాంపౌండ్ నుంచి సలహాలు అందుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: