బాలకృష్ణ హీరోగా చేసిన డిక్టేటర్ సినిమాకు శ్రీవాసు దర్శకుడు.  సినిమా పర్వాలేదనిపించింది.  దీని తరువాత భారీ బడ్జెట్ తో సాక్ష్యం సినిమా చేశాడు.  భారీ బడ్జెట్ తో తెరకెక్కినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.  ఇప్పుడు ఈ దర్శకుడికి బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.  

హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా చేసిన దే దే ప్యార్ దే సినిమా సూపర్ హిట్టైంది.  మంచి వసూళ్ళు సాధించింది.  ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.  సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ హీరోగా ఈ సినిమా నిర్మించబోతున్నారు.  ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం శ్రీవాస్ కు లభించినట్టు తెలుస్తోంది.  

హిందీలో అజయ్ దేవగణ్ పక్కన రకుల్, టబులు నటించారు.  ఈ ఇద్దరు హీరోయిన్లు తెలుగులో వెంకటేష్ పక్కన నటిస్తున్నారు. 50 సంవత్సరాలకు పైబడిన అజయ్ దేవగణ్ 25 సంవత్సరాల వయసు కలిగిన రకుల్ ప్రేమలో పడతాడు.  ఆ తరువాత భార్య నుంచి ఎలాంటి ఒత్తిడులు వచ్చాయి అన్నది కథ.  

ఎంటర్టైన్మెంట్ తో పాటు కావాల్సినంత సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో చూపించారు.  అందుకే సినిమా సూపర్ హిట్టైంది.  మరి దీనిని తెలుగులో ఎప్పుడు రీమేక్ చేయబోతున్నారు... సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: