సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన భారత్ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోతున్నది.  ఈ సినిమాకు పోటీ ఇచ్చే సినిమాలు లేకపోవడమే దీనికి కారణం.  సినిమా రేటింగ్ పరంగా కూడా మంచి రేటింగ్ వచ్చింది.  విమర్శకులు సైతం సినిమాను మెచ్చుకున్నారు.  

ఒకరకంగా చెప్పాలి అంటే రేటింగ్ వలనే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది తెలుస్తోంది.  విమర్శకులు సినిమాను ఎక్కువుగా పొగుడుతున్నారు అంటే సినిమాకు సంబందించినంత వరకు పెద్దగా బాగాలేదని, అందుకే అలా పొగుడుతున్నారని అంటారు.  

ఇది ఒక్కోసారి సినిమాకు మైనస్ అవుతుంది.  ఇప్పుడు సల్మాన్ విషయంలో కూడా అదే జరిగిందని అనుకోవచ్చు.  ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చి రెండు గంటలపాటు అన్ని మర్చిపోయి.. హ్యాపీగా ఉంటె చాలు.. సినిమా అదే హిట్ అవుతుందని చెప్పారు.  

సల్మాన్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది.  సినిమా మంచి హిట్ కొట్టింది.  కలెక్షన్లు వస్తున్నాయి.  కానీ, బయట మిక్స్డ్ టాక్ నడుస్తోంది.  ఎందుకు అలా జరుగుతుందో తెలియడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: