మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన అవెంజర్స్ ఫైనల్ మూవీ ది ఎండ్ గేమ్ ఎండ్ లేకుండా కలెక్షన్లు రాబడుతున్నది.  ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా $2.73 బిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.  ప్రస్తుతం అవతార్ కు కూతవేటు దూరంలో ఉన్నది.  

2009 లో రిలీజైన అవతార్ లాంగ్ రన్ లో $2.78 బిలియన్ డాలర్లు వసూలు చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది.  ఈ సినిమా తరువాత ఎన్నో బెస్ట్ సినిమాలు వచ్చినా అవతార్ రికార్డును బీట్ చేయలేకపోయాయి.  ఏప్రిల్ 26 వ తేదీన రిలీజైన అవెంజర్స్ కొన్ని రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించి సెకండ్ ప్లేస్ లో నిలిచింది.  

ఇప్పటికి కలెక్షన్ల సునామి కొనసాగుతూనే ఉన్నది.  మరికొన్ని రోజులు ఇలాగే వసూళ్లు రాబడితే అవతార్ రికార్డ్ బీట్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.  సూపర్ హీరోస్ అందరు ఒకే సినిమాలో కనిపించడంతో సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి.  

$356 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా నిర్మాణం ఖర్చుకు ఏడు రేట్లు అధికంగా వసూళ్లు సాధించింది.  ఒకవేళ అవతార్ రికార్డును ఈ సినిమా బీట్ చేస్తే.. ఈ రికార్డును త్వరలోనే అవతార్ 2 బీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: