తెలుగులో మజ్ను సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది మలయాళం బ్యూటీ అను.  ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  తరువాత పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి చేసింది.  అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.  శైలజా రెడ్డి అల్లుడు, నాపేరు సూర్య చేసింది.  

చేసింది కొన్ని సినిమాలే... చేతిలో హిట్స్ లేవు... ఇప్పుడు సినిమాలు లేవు.  అయినప్పటికీ.. సోషల్ మీడియా,ఓ మాత్రం ఈ అమ్మడు ఒక రేంజ్ లో దూసుకుపోతున్నది.  వరసగా హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్నది.  రీసెంట్ గా ఓ ఫోటోను పోస్ట్ చేసింది.  

మెడను వెనక్కు వంచి ఆకాశంవైపు చూస్తూ.. వర్షం కురిస్తే బాగుండు అనే కాప్షన్ ఇస్తూ ఫోటోను పోస్ట్ చేసింది.  గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వాతారణంలో వేడి మరింత ఎక్కువైంది.  ఉక్కపోతలు పోస్తున్నాయి.  దీంతో ఈ పరిస్థితినుంచి బయటపడాలి అంటే వర్షం కురవాలి.  

వర్షం కురిస్తే వాతావరణం కాస్త చల్లబడుతుంది.  వాతారణం చల్లబడితే అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  మరి అను చెప్పినట్టుగా వాతావరణంలో మార్పులు వస్తాయా చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: