హైదరాబాద్: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రెండో కుమారుడు భార్గవ్‌ రామ్‌ శుక్రవారం తొలి పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా తారక్‌.. సోషల్‌మీడియాలో అపురూపమైన ఫొటోలను పంచుకున్నారు. భార్గవ్‌ను ఎత్తకుని మురిపెంగా చూస్తున్న ఫొటోతో పాటు, పెద్ద కుమారుడు అభయ్‌ తన తమ్ముడి పక్కన కూర్చున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘భార్గవ్‌ తొలి పుట్టినరోజు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. తారక్‌ ఈ ఫొటోలు పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే దాదాపు 40 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అందరూ భార్గవ్‌ను ‘లిటిల్‌ టైగర్‌’ అని సంబోధిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌.. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నారు. తారక్‌కు, చరణ్‌కు గాయాలు కావడం వల్ల చిత్రీకరణ కొన్ని రోజులు వాయిదా పడింది. 2020 జులై 30న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: