రేణు దేశాయ్ పెళ్లి  నిశ్చితార్థం దగ్గరే ఆగిపోతుందా అని అనుమానాలు వ్యక్తం చేసిన వారికి ఊహించని విధంగా త్వరలో జరగాబోతున్న తన పెళ్లి గురించి లీకులు ఇచ్చిన రేణు మరో సంచలనానికి రెడీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు తన కొత్త సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్న రేణు దేశాయ్ అకిరాను ఇంకో మూడేళ్ళలో హీరోగా లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా లీకులు ఇవ్వడం సంచలనంగా మారింది. 

తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ‘అమావాస్యలో పున్నమి’ అంటూ తన కాబోయే భర్త గురించి త్వరలో వివరాలు చెప్పబోతున్నాను అంటూ కామెంట్స్ బట్టీ మళ్ళీ హాట్ న్యూస్ కు చిరునామాగా మారింది రేణు దేశాయ్. అయితే ఈ ట్విట్ రేణు నుంచి వచ్చి 24 గంటలు అవుతున్నా ఇంకా రేణు తన కాబోయే భర్త ఫోటోలను ఇంకా బయటపెట్టలేదు. 

మొదట్లో ఎంగేజ్ మెంట్ అయిన తరువాత వ్యక్తిగత కారణాలు వల్ల తన భర్త ఫోటోలను బయటపెట్టలేకపోయాను అని చెప్పిన రేణును టార్గెట్ చేస్తూ ఇప్పటికైనా అతడి ఫోటోలను బయటపెట్టి ఆ సస్పెన్స్ ను తొలగించమని చాలామంది కోరుతున్నారు. మరికొందరైతే మీ మ్యారేజ్ ఫోటో షూట్ ఎప్పుడు బయటకు వస్తుంది అంటూ రేణు పై జోక్స్ వేస్తున్నారు. 

దీనితో అన్నమాట ప్రకారం రేణు తనకు కాబోయే భర్త ఫోటోలను బయటపెడుతుందా లేకుంటే తన పెళ్లి ఆగిపోయిందీ అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టడానికి ఇలా రేణు వ్యూహాత్మకంగా ట్విట్ చేసిందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ‘జనసేన’ ఓటమి ఎంత హాట్ న్యూస్ గా మారిందో రానున్న రోజులలో రేణు దేశాయ్ పెళ్ళి కూడ అంతే హాట్ టాపిక్ గా మారునున్నది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: