త్రివిక్రమ్ అల్లు అర్జున్ ల లేటెస్ట్ మూవీ సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు హైదరాబాద్ లో చాలవేగంగా జరుగుతోంది. ఈమూవీకి సంబంధించిన కీలక నటీనటులు అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. వాస్తవానికి ఈసినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ సంవత్సరం విడుదల చేసే అవకాశాలు ఉన్నా బన్నీ మాత్రం ఈమూవీని సంక్రాంతి రేస్ కు రెడీ పెట్టమని చెపుతున్నట్లు సమాచారం. 

అల్లు అర్జున్ సినిమా ఈ సంవత్సరం ఏదీ రిలీజ్ కాని నేపధ్యంలో బన్నీ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఈమూవీ గురించి ఎదురు చూస్తున్నారు. అయితే ఈమూవీకి భారీ కలక్షన్స్ రావాలి అంటే కేవలం తన అభిమానుల సపోర్ట్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల సపోర్ట్ గురించి కూడ బన్నీ ఆలోచిస్తున్నట్లు టాక్. 

దీనితో ఈమూవీని సంక్రాంతి రేస్ లో నిలబెడితే ప్రజలు అంతా ఫేస్టివెల్ మూడ్ లో ఉంటారు కాబట్టి కలక్షన్స్ విషయంలో భయపడనక్కరలేదు అనీ బన్నీ ఆలోచన. దీనికితోడు సంక్రాంతి సినిమాలకు బిజినెస్ కూడ చాల బాగుంటుంది కాబట్టి త్రివిక్రమ్ బన్నీల క్రేజ్ తో ఈమూవీకి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న అరవింద్ కు మంచి లాభాలు వస్తాయి అని కూడ బన్నీ ఆలోచన అని అంటున్నారు. 

అయితే ఈ సంక్రాంతి రేస్ కు మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇప్పటికే ఫిక్స్ అయింది. దీనితో రాబోతున్న సంక్రాంతి మహేష్ అల్లు అర్జున్ ల వార్ గా మారుతుందా మధ్యలో ఇదే సంక్రాంతి సీజన్ పై కన్నేసిన బాలకృష్ణ రజినీకాంత్ మూవీల పరిస్థితి ఏమిటి అంటూ కొందరు నిజంగానే బన్నీ ఈ సాహసం చేస్తాడా అన్న సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే మహేష్ కు సన్నిహితుడైన త్రివిక్రమ్ ఈ పోటీకి ఎంతవరకు అంగీకరిస్తాడు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: