ఈ మద్య కాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అవుతున్నా..కొన్ని సార్లు దారుణమైన ఫలితాలు చవిచూస్తున్నాయి. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ మద్య నటించిన లింగా ఎన్నో అంచనాలతో వచ్చింది..కానీ అట్టర్ ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లరు దారుణంగా నష్టపోయారు.  అయితే అది పెద్ద సమస్యగా మారడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ జోక్యం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించారు.

ఇలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో పెద్ద పెద్ద స్టార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి..నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన  'ఎన్జీకే’ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో  తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు యాభై శాతం నష్టాలను మిగిల్చినట్టు సమాచారం. తమిళ హీరో సూర్య కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగు లో రిలీజ్ అయి మంచి విజయాలు పొందాయి. 

ఈ నేపధ్యంలో సూర్య, సాయి పల్లవి, రకూల్ ప్రీత్ సింగ్ నటించిన 'ఎన్జీకే’  రిలీజ్ అయి ఘోర పరాజయం పొందింది. రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి 9 కోట్లకి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను అమ్మారు. ఇంతవరకూ మొత్తం ఈ సినిమా 4.5 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో యాభై శాతం నష్టాలతో బాక్సాఫీస్ రన్ క్లోజ్ చేశారు. ఈ సినిమా పరాజయంపాలైనట్టు సూర్య స్వయంగా చెప్పేయడం విశేషం. ప్రస్తుతం సూర్య తన తదుపరి సినిమాపై దృష్టిపెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: