కొన్ని రోజుల క్రితం "ఆమీర్ ఖాన్" కూతురు ’ఐరా ఖాన్" కూతురి తన  ఫ్రెండ్ "మిషల్ కిర్పాలాని" తో కలిసి దిగిన  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది వీరిద్దరు సహజీవనంలో ఉన్నారని అనుకున్నారు.

అయితే ఆ పుకార్లకి సమాధానం ఇచ్చింది ఐరా.  సోషల్ మీడియాలో ఒక నెటిజన్, మీరు "మిషల్ కిర్పలాని" తో డేటింగ్ లో ఉన్నారా అని అడగగా అవునని సమాధానం ఇచ్చింది. అంతటితో ఆగకుండా  మిషల్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోల్లో ఐరా మిషల్ కి చాలా సన్నిహితంగా ఉంది. ఆమె పుట్టినరోజు వేడుకను మిషల్ తో జరుకున్న ఫోటో కూడా అందులో ఉంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టిందనే చెప్పాలి.

ఇక దీనిపై ఆమీర్ ఖాన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. తన కూతురి గిరించి ఆమీర్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: