తనతో పాటు నటించే నటీనటులతో చాలా సరదా గా వ్యవహరిస్తారు రజనీకాంత్. అయితే ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో రజినీకాంత్ తనతో సరదాగా ఉన్న క్రమంలో నయన్ తన బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ విగ్నేష్ నీ రజనీకాంత్ కి పరిచయం చేయడం జరిగింది. నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ కి రజనీకాంత్ సినిమా చేయాలని చిరకాల కోరిక. ఇదే క్రమంలో ఆ విషయాన్ని నయనతార రజనీకాంత్ కి చెప్పడం జరిగింది. దాంతో రజనీకాంత్ చూద్దాం మంచి టైమింగ్ మరియు స్టోరీ దొరికితే చేయవచ్చు అని ఆ సమయంలో క్యాజువల్గా చెప్పారట.


దీంతో నయనతార షూటింగ్ సమయంలో ఎక్కడపడితే అక్కడ రజనీకాంత్ దగ్గర విగ్నేష్ ప్రస్తావన దొరికినప్పుడల్లా తీసుకురావడంతో మరియు అదే విధంగా విగ్నేష్ డైరెక్ట్ చేసిన సినిమాల డీవిడిలు సైతం రజనీకాంత్ కి ఇవ్వడంతో...రజనీకాంత్ కి చిర్రెత్తుకొచ్చింది. దీంతో వెంటనే నయనతారకు నాకు విగ్నేష్ తో ఇప్పటికిప్పుడే సినిమా చేసే ఆలోచన లేదని ఖరాఖండిగా చెప్పేశారట. అయితే ఆ తర్వాత మళ్లీ షూటింగ్ సమయంలో ఈ ప్రస్తావన మళ్లీ నయనతార తీసుకురావడంతో గమనించిన రజనీకాంత్ సీరియస్ అయ్యారట.


ప్రొఫెషనల్ విషయాల్లోకి పర్శనల్ లైఫ్ ని తేవద్దని చెప్పారట. నాకు అంతగా విఘ్నేష్ తో సినిమా చెయ్యాలనిపిస్తే పిలిపించి చేస్తాను. నాకు ఎవరి రికమండేషన్ అవసరం లేదు. అలాగే నువ్వు కూడా అలా చీటికి మాటకి పదే పదే అతని గురించే చెప్పకు. మాకు ఇబ్బంది గా ఉంటుందని సున్నితంగా చెప్తూనే, సీరియస్ గా హెచ్చరించారట. దీంతో ఈ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: