బోనీకపూర్ కుమారుడు "అర్జున్ కపూర్" ప్రస్తుతం చేస్తున్న సినిమా "పానిపట్" యుద్ధ నేపథంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ సినిమా కోసం అర్జున కపూర్ చాలానే శ్రమ పడుతున్నాడు.

శరీరాకృతిని పాత్ర కి తగిన విధంగా మార్చుకుంటున్నాడు. ఒక యోధుడిలా కనిపించడానికి జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నాడు. అలా వర్కవుట్ చేస్తున్నపుడు దిగిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

చొక్కా లేకుండా దిగిన ఆ ఫోటోకి చాలా మంది కామెంట్స్ చేసారు. వారిలో మలైకా అరోరా కూడా ఒకరు. మలైకా అరోరా, అర్జునకపూర్ లు కొంత కాలంగా డేటింగ్ లో ఉంటున్నట్టు పుకార్లు వస్తున్నాయి.

ఇలా మలైకా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.  అర్జున్ కపూర్ అంకుల్స్ కూడా ఈ ఫోటో పై కామెంట్స్ చేసారు. అతని అంకితభావానికి అందరూ మెచ్చుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: