ఈ మధ్య ప్రచార కార్యక్రమాలు కూడా వింతగా మారిపోతున్నాయి. ప్రచారంలో కొత్తదనం లేకపోతే జనాలు అస్సలు పట్టించుకోవట్లేరు. కొత్తగా ప్రచారం చేయడానికి కొందరు పడే తిప్పలు హాస్యాస్పదంగా ఉంటే మరికొందరివి చాలా క్రియేటివ్ గా ఉంటున్నాయి.

రిచా చడ్డా రీసెంట్ గా శాఖాహారం గురించి ప్రమోట్ చేసింది. దానికోసం ఆమె  క్యాబేజీ లాగా డిజైన్ చేసుకున్న స్కర్ట్ వేసుకుంది.  ఈ ఫోటో ని ఆమె షేర్ చేస్తూ అమెరికన్ పాపులర్ న్యూట్రిషనిస్టు కొటేషన్ ని కూడా జత చేసింది.

" నేను తినే అహారంలో భయం ఉండదు, అపరాధం ఉండదు. అని శాఖాహారం గురించి ప్రమోట్ చేసింది. రిచా చడ్డా 2015 నుండి శాఖాహారిగా ఉంటుంది.

ఈ డ్రెస్ తో మేకల దగ్గరకి వెళ్ళకండి బాగోదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  రిచా చడ్డా ప్రస్తుతం కోర్టు డ్రామా అయిన " సెక్షన్ 375" అనే సినిమాలో అక్షయ్ ఖన్నా సరసన నటిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: