ప్రేమలో ఉండగా రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే హిందీ పరిశ్రమని ఊపేశారు. వీరిద్దరి క్రేజ్ ,కెమిస్ట్రీ తెర మీద బాగా కుదిరింది. ’రామ్ లీలా’ బాజీరావ్ మస్తానీ’ ’పద్మావతి’ లాంటి సినిమాల్లో ఈ జంట ఎంతగానో ఆకట్టుకుంది.

పెళ్ళయ్యాక వీరిద్దరు ఇప్పటివరకు కలిసి నటించలేదు. వీరిద్దరు కలిసి నటిస్తే చూడాలని జనం కోరుకుంటున్నారు. అయితే ఆ సమయం వచ్చేసింది. రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా 83. ఇది 1983 ప్రపంచకప్ నేపథ్యంలో సాగే సినిమా.

ఇందులో కపిల్ దేవ గా రన్ వీర్ సింగ్ కనిపించనున్నారు.  అయితే కపిల్ దేవ భార్యగా దీపికా పదుకొనె ని అడిగారట. ముందుగా దీపిక కి ఇందులో నటించాలని లేదట.

కానీ కథ విన్న తర్వాత కపిల్ దేవ్ భార్య పాత్రకున్న ప్రాముఖ్యం అర్థమై వెంటనే ఒప్పుకుందట. అయితే ఈ సినిమా కి ఆమె రెమ్యునరేషన్ 14 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇది తెలిసి బాలీవుడ్ ఆశ్చర్యపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: