ఒక్కోసారి మన దగ్గరి వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా మనకు నచ్చింది చేసేస్తాం.  వాళ్ళు ఎందుకు చెప్తున్నారు  అనే విషయం పట్టించుకోము. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కి అలానే జరిగింది. తండ్రి మాట వినకుండా పప్పు లో కాలేశాడు.

ఇటీవల వచ్చిన "సీత" సినిమాలో పాత్రని ఒప్పుకోవద్దని బెల్లంకొండ సురేష్ చెప్పారట. కానీ ఆ మాటను పెడ చెవిన పెట్టి నటుడిగా నిరూపించుకోవాలంటే అటువంటి పాత్ర చేయాలని పట్టు పట్టి మరీ చేసాడట.

సినిమా రిలీజయ్యి బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అయిన ’సీత’ లో కాజల్ కి మంచి పేరొచ్చింది. విలన్ గా నటించిన సోనూసూద్ కి కూడా బానే పేరొచ్చింది. ఎటొచ్చి నష్టం జరిగింది శ్రీనివాస్ కే.

తన తండ్రి చెప్పిన మాట విననందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడట. తండ్రి మాట వినుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అనుకుంటున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: