ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు.  తాజాగా ఇప్పుడు పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో హీరోగా పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలతో మంచి విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ పరంగా మెగా హీరోకి తగ్గట్టు సాయిధరమ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు. 


తాజాగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు  'ఉప్పెన' సినిమాను రూపొందిస్తున్నాడు. హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది.  ఆ మద్య ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఆద్యంతం ప్రేమ కథతో పాటు జాలర్ల లైఫ్ స్టైల్ ని చూపించబోతున్నారట.  ‘పిజ్జా’సినిమాతో వెండితెరకు పరిచయం అయిన విజయ్ సేతుపతి తర్వాత విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తోన్నారు.  హీరోగానే కాకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా నటించి మెప్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న  'సైరా' సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. 


 వైష్ణవ్ తేజ్ హీరోగా  'ఉప్పెన' విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నారట. ఈ సినిమాలో ఆయన హీరోయిన్ కి తండ్రిగా నటిస్తున్న విజయ్ సేతు పతి హీరో ని రక రకాలుగా ఇబ్బందులకు గురి చేసే విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట.అంతే కాదు ఈ పాత్ర మూవీకి చాలా హైలెట్ గా నిలవబోతుందట. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ కొత్త హీరో మెగా ఫ్యాన్స్ ని ఏ స్థాయిలో మెప్పిస్తాడో వేచి చూడలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: