యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ అప్‌క‌మింగ్ మూవీ సాహో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్‌గా రిలీజైన‌ టీజర్ స‌రికొత్త రికార్డుల‌కు తెర‌లేపింది. ప్రభాస్‌ బాహుబలి తరువాత బిగ్‌స్క్రీన్‌పై కనిపించక చాలా రోజులు అయ్యేసరికి అభిమానులు ఆకలిగా ఉన్నారా అన్న‌ట్టుగా దేశ‌వ్యాప్తంగా టీజ‌ర్‌ను కుమ్మేశారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం.. ఇలా నాలుగు భాష‌ల్లో విడుద‌లైన ఈ టీజ‌ర్‌ను విడుద‌లైన 24 గంట‌ల్లోనే 6 కోట్ల మంది చూశారు.
విడుదలైన ఒక్క రోజుల్లోనే 60మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుందంటూ చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. ఇక భాషాల వారిగా చూస్తే, హిందీలో ఈ టీజ‌ర్‌ను అత్య‌ధికంగా 2 కోట్ల 40 ల‌క్ష‌ల మంది చూశారు. తెలుగు టీజ‌ర్‌ను 1 కోటి 50 ల‌క్ష‌ల మంది చూశారు. ఇక త‌మిళ టీజ‌ర్ 93 ల‌క్ష‌ల 60 వేలు, మ‌ల‌యాళ టీజ‌ర్‌ను 9 ల‌క్ష‌ల 12 వేల మంది చూశారు. ఈ టీజ‌ర్‌ను 13 లక్ష‌ల మంది లైక్ చేయ‌గా, కేవ‌లం 57 వేల డిస్‌లైక్‌లు మాత్ర‌మే వ‌చ్చాయి. అంటే అత్య‌ధికంగా లైక్‌లు అందుకున్న టీజ‌ర్‌ల‌లో కూడా సాహో అనిపించింది. 77 వేల కామెంట్స్ దాదాపుగా పాజిటివ్‌గానే వ‌చ్చాయి. డార్లింగ్ సినిమా కోసం దేశ‌వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంత ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది.
మొత్తానికి టీజ‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగేలా చేయ‌డంలో డైరెక్ట‌ర్ సుజిత్ స‌క్సెస‌య్యాడ‌నే చెప్పాలి. ఆగస్ట్‌ 15న విడుద‌ల కానున్న ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డుల‌కు తెర‌లేపుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: