చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ ని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ ఇటీవల సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వార్తల్లో రావడంతో ఇండస్ట్రీలో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. అసలు విషయంలోకి వెళితే కళ్యాణ్ దేవ్ ని కొంతమంది ఆకతాయిలు ఇంస్టాగ్రామ్ లో కావాలని ఇష్టానుసారంగా వేధింపులకు గురిచేస్తూ అనవసరమైన కామెంట్లు చేస్తున్నారని కళ్యాణ్ దేవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ముఖ్యంగా ఫేక్ ఎకౌంటు తో కామెంట్లు పెడుతూ తనని మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పక్క ఆధారాలతో పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి ఐడీలతో పాటు అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ పది మందిపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.


ఐదు రోజుల క్రితం కళ్యాణ్ దేవ్ నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశారు. వారి నుండి వివరాలు అందుకున్న వెంటనే నిందితులుగా గుర్తించిన పది మందిని అరెస్ట్ చేశారు. 'విజేత' సినిమాతో వెండితెరకు పరిచయమైన కళ్యాణ్ గారు  ప్రస్తుతం పులి వాసు డైరెక్టర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: