తమిళం తో పాటుగా తెలుగులో కూడా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న హీరో విశాల్. వాస్తవానికి ఆయన తండ్రి మన తెలుగు రాష్ట్రానికి చెందినవారైనప్పటికీ వారి వ్యాపారాలు చెన్నైలో ఉండడంతో వారు తమిళనాడులో స్థిరపడడం జరిగింది. ఇకపోతే పందెం కోడి సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న విశాల్, ఆ తరువాత చేసిన వరుస సినిమాలతో తెలుగు మరియు తమిళ్ లో మంచి హీరోగా స్థానం సంపాదించారు. 

ఇకపోతే వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అలవాటుగల విశాల్, ఇటీవల జరిగిన నడిగర్ సంగం ఎన్నికల సమయంలో అప్పటి నడిగర్ సంఘం సభ్యులపై తనదైన శైలిలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్నికల్లో దిజి నడిగర్ సంగం సెక్రటరీ జనరల్ గా ఎన్నికయ్యారు విశాల్. ఇక త్వరలో నడిగర్ సంగం ఎన్నికల సందర్భంగా విశాల్, వరలక్ష్మితండ్రి శరత్ కుమార్ గారిపై విమర్శలు గుప్పించారు. ఇక వాటిపై తన సోషల్ మీడియా ఖాతాల్లో విశాల్ కు గట్టిగా రిటార్ట్ ఇచ్చింది వరలక్ష్మి. గతంలో కూడా నువ్వు ఇలానే నా తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేసావు, అయితే నువ్వు స్నేహితుడివి అవ్వడంతో నేను నీ ప్రక్కనే నిలబడ్డాను, 

కానీ ఇప్పడు ఎన్నికల్లో మా నాన్నగారు లేరు కదా, అయినప్పటికీ అయన టాపిక్ ఇప్పుడు ఎందుకు తీసుకువస్తున్నావు. ఒకవేళ నువ్వు చెప్పినట్లు అయన నడిగర్ సంఘంలో ఉన్నపుడు ఏమైనా తప్పుడు పనులు చేసి ఉంటె ఆయనకు చట్టప్రకారం శిక్షపడేది, అటువంటిది ఏమి లేదంటే, అయన ఎటువంటి తప్పు చేయలేదు అనే కదా అర్ధం. అయినా మా నాన్నని ఇంకా తప్పుపడుతున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, ఈ చర్యతో నువ్వు స్నేహితురాలిగా నా వోట్ ని కోల్పోయావ్ అంటూ ఆమె తన పోస్ట్ ద్వారా తెలిపింది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: