సూపర్ స్టార్ మహేష్ బాబు కు సంబందించిన ఫైనాన్షియల్ పనులు, ఇన్వెస్ట్ మెంట్స్ అన్ని అతని భార్య నమ్రత చూసుకుంటుంది. చివరకు మహేష్ బాబు సినిమాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది నమ్రత. కొంతకాలంగా మహేష్ బాబుకు సంబందించిన హోమ్ ప్రొడక్షన్ బ్యానెర్లు అన్ని ఇనాక్టీవ్ గా ఉన్న సంగతి తెలిసిందే.


కానీ నమ్రత, మహేష్ కలసి వాటిని మళ్ళీ యాక్టివ్ గా మార్చనున్నారు. ఇప్పటికే అడవిశేష్ హీరోగా రూపొందుతున్న మేజర్ సినిమాని నిర్మిస్తున్నారు. జీఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వయంగా ఈ సినిమా నిర్మితమవుతుంది. అంతేకాక ఈ బ్యానర్ లో మహేష్, అనిల్ రావిపూడి సినిమాకు కూడా సహా నిర్మాతగా వయ్వహారిస్తున్నారు.


ప్రొడక్షన్ పనులన్నీ నమ్రతనే దగ్గరుండి చూసుకుంటుంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో ముందుకు వెళ్ళడానికి హైదరాబాద్ లో ఆఫీస్ తీసుకొని నమ్రత ఈ పనుల్ని చూసుకుంటుందని, రెగ్యులర్ గా మీటింగ్స్ కూడా పెడుతున్నారని తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్రత పూర్తిగా నిర్మాతగా మారబోతున్నట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: