మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా. రాయలసీమ విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దాదాపుగా రూ.200 కోట్లవరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 

గత ఏడాది మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇక కాసేపటి క్రితం ఈ సినిమా విడుదల తేదీ మరియు ట్రైలర్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చినట్లు కొన్ని మీడియా ఛానల్స్, అలానే టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వారు చెప్తున్న వివరాల ప్రకారం సైరా ట్రైలర్ ని మెగాస్టార్ బర్త్ డే రోజైన ఆగష్టు 22న విడుదల చేసి, సినిమాని గాంధీ జయంతి రోజు, అనగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చిత్ర యూనిట్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. 

అంతేకాక అతిత్వరలో దీనిపై ఒక అధికారిక ప్రకటన కూడా వెలువరించనుందట చిత్ర యూనిట్. మరి ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఈ వార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపోతే మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, సుదీప్ ఇతర పాత్రల్లో నటిస్తుండగా రత్నవేలు ఫొటోగ్రఫీ అందిస్తున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: