సినిమాల్లో విలన్లు తమ ప్రేయసిని..భార్యను కడతేర్చడానికి రక రకాల కన్నింగ్ ప్లాన్లు వేస్తుంటారు.  అది సినిమాల్లో అయితే ప్రేక్షకులు థ్రిల్ గా భావిస్తారు..కానీ నిజ జీవితంలో ఓ సినీ నటుడు తన కట్టుకున్న భార్యను తన స్నేహితులతో దారుణంగా చంపాలని ప్లాన్ వేసి అడ్డంగా పోలీసులకు బుక్ అయ్యాడు.  వివరాల్లోకి వెళితే...సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న  పద్మ శ్రీ కి తన మాయ మాటలు చెప్పి లొంగతీసుకున్నాడు కన్నడ నటుడు శబరీష్ శెట్టి.

కొంత కాలం వీరి మద్య ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. అయితే తనకు పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు తెలుసని చెప్పడంతో పద్మ శ్రీ,  శబరీష్ శెట్టి ని పూర్తిగా నమ్మి పెళ్లి చేసుకుంది.  కానీ అతనికి ప్రవర్తనలో మార్పు రావడం..తనను పట్టించుకోకపోవడం..చివరికి శబరీష్ శెట్టి అప్పటికే వివాహం జరిగిందని తెలుసుకొని ఆ  పద్మ శ్రీ ఆవేదన చెందింది..  కొన్ని రోజుల వరకు వాగ్వివాదాలు నడిచాయి.

ఇక నిజం బయటపడింది కాబట్టి ఆమెను అంతమొందించాలని శబరీష్ కుట్ర పన్నాడు.  ఐదుగురు స్నేహితులని పిలిపించి ఆమెను హత్య చేయాలనీ ప్లాన్ వేశాడు.  ఈ నేపథ్యంలో ఆమెకు మత్త మందు ఇచ్చి కాళ్లూ చేతులు కట్టేసి తన ఐదురుగురు స్నేహితులను పిలిపించుకొని మర్డర్ కి ప్లాన్ చేశారు శబరీష్ శెట్టి. అయితే పద్మ శ్రీ అదృష్టం బాగుండి అప్పుడే ఆమె స్నేహితుడు అక్కడకు వెళ్లడం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం..వారు వొచ్చి శబరీష్ శెట్టి..మరొక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన నలుగురు స్నేహితులు పరారీలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: