త్రివిక్రమ్ శ్రీనివాస్  - బన్నీ కలయికలో రాబోతున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతున్న  విషయం తెలిసిందే. ఇక ఒకప్పటి టాప్ హీరోయిన్స్ ను  తన సినిమాల్లో   తల్లి లేదా అత్త క్యారెక్టర్స్ లో  చూపిస్తుంటారు త్రివిక్రమ్. అలాగే ఇప్పుడు  అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి  హాట్ హీరోయిన్ టబును చూపించబోతున్నాడు. సెకెండ్ షెడ్యూల్ లో టబుకి సంబంధించిన సీన్స్ ను షూట్ చేయనున్నారు. అయితే  టబు అంటేనే ఇప్పటికీ కుర్రకారులో హీరోయిన్ రూపమే ప్రత్యక్షమవుతుంది. 


మరి అలాంటి  హీరోయిన్ ను తమ అభిమాన స్టార్ హీరోకి మదర్ గా చూస్తారా.. ? త్రివిక్రమ్ కాబట్టి రెండు బలమైన సన్నివేశాలతో  నాలుగు లోతైన డైలాగ్ లతో తల్లిగా ఒప్పించేస్తాడు. అయినప్పటికీ టబును ఇంకా హీరోయిన్ గానే చూడాలనుకుంటున్న  ప్రేక్షకులకు మాత్రం ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే.  తమన్ సంగీతం అందించనున్న  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు  హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మించనున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: