లవ్ డైలాగ్స్ చెబుతూంటే పెదాలే కాదు మనసు కూడా కదులుతుంది. అది పక్కనున్న హీరోయిన్ కావచ్చు. పరిచయం ఉన్న అమ్మాయి కాదు. గుండె లవ్ లవ్ అని కొట్టుకున్నాక రీల్, రియల్ అన్న తేడా ఉండదుగా లవ్ అంటే అదే మరి. ఎవరినైనా పడేస్తుందంతే.


యంగ్ హీరోల్లో ఆ మధ్య కాస్తా దూకుడుగా హిట్లు కొట్టిన రాజ్ తరుణ్ ఇపుడు వెనకబడ్డాడు. ఆ సంగతి అలా ఉంచితే ఈ హీరో గారికి రియల్ లైఫ్ లో హీరోయిన్ దొరికేసింది. విజయవాడకు చెందిన ఓ వ్యాపారవేత్తలో ఆరేళ్ళుగా లవ్ లో ఉన్నట్లుగా రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ రివీల్ చేశాడని టాక్. 


ఆమెకు తాను, తనకు ఆమె బాగా నచ్చేశామని, తమది విడదీయని బంధమని కూడా రాజ్ తరుణ్ చెప్పుకున్నాడు. ఇక పెళ్ళి బాజాలు ఎపుడు మోగుతాయి అంటే నాదేన్  లేట్ కాదు ఆ అమ్మాయిదే ఆలస్యం అంటున్నాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది పెళ్ళి చేస్తుంటానని అంటున్న ఈ యంగ్ హీరో సినిమాలో లవ్ కోసం ఎన్ని బాధలో పడినా నిజ జీవితంలో మాత్రం హ్యాపీగానే ప్రేమను గెలిచేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: