2011 లో క్రికెట్, గర్ల్ అండ్ బీర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు నాగ శౌర్య.  ఈ సినిమాలు పర్వాలేదనిపించాయి.  ఈ రెండు సినిమాల తరువాత చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద వంటి సినిమాలు వచ్చాయి. 


ఈ సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి.  ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ యువహీరో.  సినిమా పరంగా చూసుకుంటే ఇది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.  ఈ సినిమా హిట్ తో మరో స్థాయికి చేరిపోయింది.  దీంతో ఈ హీరోకు ఎప్పుడు లేనంతగా క్రేజ్ వచ్చింది.  


ఇంతవరకు బాగానే ఉన్నది.  సమంత హీరోయిన్ గా చేస్తున్న ఓ బేబీ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు.  ఇందులో ఈ హీరోకు మంచి పేరు వచ్చింది.  నాగ శౌర్యతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కష్టం అని సమంత చెప్పడం విశేషం.  ఈ సినిమాపైనే నాగశౌర్య భవిష్యత్ ఆధారపడి ఉంది.  


దీనిని పక్కన పెడితే.. ఐరా క్రియేషన్స్ బ్యానర్లో నాగ శౌర్య ఓ సినిమా చేస్తున్నాడు. విశాఖలో షూటింగ్ జరుగుతుండగా గాయాలయ్యాయి.  డూప్ లేకుండా రిస్కీ సీన్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.  హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి.. చికిత్స చేయించారు.  మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: