దాదాపు రెండు వందల కోట్ల పైన బడ్జెట్. మెగాస్టార్ చిరంజీవి - బిగ్ బి అమితాబ్ బచ్చన్ - సుదీప్-  విజయ్ సేతుపతి-నయనతార-తమన్న లాంటి క్యాస్టింగ్ తో భారీ మల్టీ స్టారర్. తెలుగు, హిందీ, తమిళం..ఇలా పలు భాషల్లో విడుదల చేయాల్సిన బాధ్యత. ఓవర్సీస్ తో పాటు ఇండియా వైడ్్గా బిజినెస్ డీల్స్ క్లోజ్ చేయాలి. ఇన్ని బాధ్యతల మధ్య నిర్మాత రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. అందుకే  సైరాకు ముందు ముందు చాలా టఫ్ టైం రాబోతోంది. అక్టోబర్ 2 నే సైరా విడుదల అని అధికారికంగా ప్రకటించకపోయినా ప్రస్తుతానికైతే అదే డేట్‌ని లాక్ చేసినట్లు సమాచారం. 


ఆగస్ట్ 15 న సాహో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అందులో భాగంగానే ప్రమోషన్స్‌లో స్పీడ్ ఎక్కువైంది.  అందుకనే చరణ్ సాహో విడుదల దాకా సైలెంట్ గా ఉండి ఆ తర్వాత చిరు బర్త్ డే ఆగస్ట్ 22న కాబట్టి సైరా పబ్లిసిటీ అప్పటి నుంచి ప్రారంభించబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్. సాహోని దృష్టిలో ఉంచుకునే సైరాకు సంబంధించి ఎలాంటి హైప్ తెచ్చే ప్రచారాలు చేయకూడదని చరణ్ ముందే తన టీమ్ కు చెప్పాడని ఇన్‌సైడ్ టాక్. 


సాహో, సైరా... రెండు సినిమాలు ఒకేసారి ప్రమోషన్ లో ఉంటే పోలికలతో అనవసరమైన చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టే ఇలా చరణ్ టీమ్ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలిసింది. సో మెగాభిమానులు ఎంత కోరుకున్నాఆగస్ట్ మూడో వారం నుంచి మాత్రం సైరా హంగామా మొదలుకానుంది. అఫిషియల్ గా డేట్ ప్రకటించడం కూడా అప్పుడే జరుగుతుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే తప్ప చేయగలిగిందేమీ లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: