Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 8:43 am IST

Menu &Sections

Search

ప్చ్.. లెజండరీ దర్శకులందరూ పరాజయాలతోనే ముగించారుగా !

ప్చ్..  లెజండరీ  దర్శకులందరూ  పరాజయాలతోనే ముగించారుగా  !
ప్చ్.. లెజండరీ దర్శకులందరూ పరాజయాలతోనే ముగించారుగా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com


ఎంతవారికైనా పరాజయం తప్పదు.  అంతెందుకు గొప్ప గొప్ప  దర్శకులందరూ  పరాజయాలతోనే ముగించారు. ఆ నాటి కేవీ రెడ్డిగారి దగ్గరనుండి  ఈ నాటి రామ్ గోపాల్ వర్మ  వరకు పరిశీలిస్తే  కఠినంగా ఉన్నా ఈ వాక్యం అక్షర సత్యం. కేవీ రెడ్డి గారు తీసిన 'మాయాబజార్ చిత్రం' సినిమాకి  వ్యాకరణ గ్రంధం గొప్పగా చెప్పుకుంటుంటాం.   గుణసుందరి కథ, పాతాళభైరవి లాంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన  కెరీర్ ముగుంపులో మాత్రం ప్లాప్ చిత్రాలు తీసి  చివరకి ఒక చిత్రానికి అయితే అబద్దపు దర్శకుడిగా కూడా పిలవబడ్డారు. అలాగే   తెలుగు సినిమాకు మొట్టమొదటిగా  జాతీయ  స్థాయిలో  ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన దర్శకతపస్వి   కళాతపస్వి  కె .విశ్వనాధ్. ఎన్నో ప్రశస్తమైన చిత్రాలను సృష్టించిన ఈయన చివరిగా  స్వరాభిషేకం  శుభప్రదం లాంటి  ప్లాప్ చిత్రాలు తీసి ఇక దర్శకత్వాన్నే విరమించుకున్నారు.   ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన దర్శక రత్న దాసరి నారాయణరావు. తెలుగు సినిమా రికార్డ్ లను ఎన్నో సార్లు తిరగరాసిన ఏకైక దర్శకుడు. కానీ చివరిదశలో అయన ఎంతో ఇష్టపడి ప్రేమించి చేసిన యంగ్ ఇండియా, పరమవీరచక్ర, ఎర్రబస్సు చిత్రాలు అత్యంత దారుణంగా  పరాజయాలయ్యాయి. ఈ కోవకి చెందిన  లెజండరీ దర్శకుడు బాలచంద్ర పరిస్థితి కూడా ఇంతే.  ఇలా  చెప్పుకుంటే ఆదుర్తి సుబ్బారావు, వేదాంతం రాఘవయ్య, కె యస్ ఆర్ దాసు, క్రాంతి కుమార్  లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు.  ఆ తర్వాత తరం వాళ్లలో  గుర్తుతెచ్చుకోవాల్సిన అతి ముఖ్యమైన దర్శకుడు  హాస్యబ్రహ్మ  జంధ్యాల.  'ఆహా నా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ హాస్యచిత్రాలను రూపొందించి మన ముందు జెనరేషన్లకు కూడా  ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించారు. అంతటి ఆయన చివరిగా తీసిన 'ఓహో  నా పెళ్ళంట, విచిత్రం' చిత్రాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లిపోయాయో తెలియని పరిస్థితి.  అదేవిధంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ను నెలకొల్పిన  కోదండరామిరెడ్డి, బి గోపాల్  వంటివారు పరిస్థితి  ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. 


ఇక నిన్నటి తరంవారిలో ముఖ్యంగా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేర్లు. మణిరత్నం, రాంగోపాల్ వర్మ, కృష్ణ వంశీ, పెద్దవంశీ, పూరి జగన్నాధ్, ఇలా చాలామందే ఉన్నారు. ముఖ్యంగా  మణిరత్నం తన సినిమాలతో  మూస పద్ధతి ఫిల్మ్ మేకింగ్‌ కి  వీడ్కోలు పలుకుతూ  ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు.  కానీ గత కొన్ని సంవత్సరాలుగా  వరస పరాజాయాలతో సతమమవుతూ కోల్పోయిన ఉనికిని కాపాడుకోవటానికి ఇప్పటికి ప్రయత్నిస్తున్నాడు. ఇక రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుకుంటే  తాను తీసిన  'శివ' చిత్రం భారతీయ సినీ గమనాన్నే  ప్రభావితం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.   దాంతో, రాంగోపాల్ వర్మ  ఒక్క సినిమాతోనే  గొప్ప దర్శకుల్లో ఒకడిగా ఖ్యాతి పో౦దాడు. కానీ ఆ తర్వాత తీసిన అంతం, కంపెనీ, సర్కార్ లాంటి సినిమాలతో  ఆ ఖ్యాతిని మరింత పెంచుతూ తారాస్థాయికి తీసుకెళ్లాడు. ఒక తెలుగు డైరెక్టర్  ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అయినందుకు తెలుగు సినిమా గర్వపడింది. కానీ చివరకి ఎంత గొప్ప శిఖరం ఎక్కినా, కిందకు దిగక తప్పదు అనేవిధంగా.. రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలన్నీ  అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి.  చివరకి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలను పూర్తిగా కోల్పోయీ,  రాంగోపాల్ వర్మ సినిమా ఐస్ క్రీ౦ స్థాయికి పడిపోయింది.  అయినా ఈ  మధ్య  వర్మలో మునపటి స్పార్క్  ఫైర్ ఎక్కడ కనిపించడం లేదు. కెమెరా యాంగిల్స్  పెట్టడంలో ఎక్స్ పర్ట్  అయిన వర్మ, ఆఫీసర్ సినిమాలో  అయితే  కొన్ని షాట్స్  మరీ పేలవంగా తీశాడు.  వర్మ ఫిలిం మేకింగ్ మర్చిపోయాడనే ఫీలింగ్  కలిగించాడు. క్రియేటివ్ డైరెక్టర్ గా  పేరున్న కృష్ణవంశీ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఇక పూరి జగన్నాధ్ గత కొంతకాలం నుంచి భారీ హిట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.  పెద్ద వంశీ తీసిన లేడీస్ ట్రైయిలర్ సీక్వెల్  గతంలో  వంశీ తీసిన క్లాసిక్ చిత్రాలకే మచ్చగా మిగిలిపోయింది.  ఏమైనా అన్ని భాషల్లోనూ  ఇలాగే  గొప్ప గొప్ప దర్శకులందరూ పరాజయాలతోనే  తమ దర్శకత్వానికి  ముగింపు పలకటం విచారకరం.



tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'కళ్యాణ్ రామ్' కామెడీ చేయగలడా  ?
పాపం.. ఈ హిట్ బ్యూటీకి  ఛాన్స్ లు లేవు !
'భీష్మ'  వీళ్లను  ఏమి చేస్తాడో  ?
 'జగన్ - బాబు'ల పై  పవన్ ఇంట్రస్టింగ్ ప్లాన్ !
 'ముదురు భామ'తో ప్రేమ  నిజమే !
 ఇవి చెయ్యకపోతే  'జగన్' ఇక కష్టమే !
గజదొంగ కామెడీ  బాగా చేస్తాడట !
ప్చ్..  టీడీపీని బతకనించేలా లేరు !
మోదీకి జగన్ శత్రువుగా మారాడా ?
కాలేజీలకు వెళ్లనున్న 'గుణ 369' !
  'బాబు'ను ముంచేయటానికి  'జగన్' స్కెచ్ !
జగన్ పై  'బాబు' అదిరిపోయే ప్లాన్  !
'ఇస్మార్ట్ శంకర్'  సెకెండ్ డే కలెక్షన్స్  !
మళ్లీ  డీసెంట్ గా  ఫిదా చేస్తాడేమో ?
జ‌గ‌న్ ప్లాన్ కి..  బాబుతో పాటు బీజేపీకి కూడా దెబ్బే !
ఆ వైసీపీ నేతల పై   జగన్ ఆగ్రహం !
  ఈ సారి ఫుల్ ఎనర్జీతో వస్తున్నాడట.. !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.