సోషల్ మీడియాలో జరిగే కొన్ని విషయాలు అంత సులభంగా నమ్మలేము. కానీ ఆ విషయాలు నిజమని తెలిశాక షాక్ తగలక మానదు. ఇలాంటి విషయమే దర్శకుడు మురుగదాస్ కు ప్రాక్టికల్‌గా అనుభవమయింది. అది కూడా రీసెంట్‌గా. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్ తీస్తున్న మురుగదాస్ ఈ సినిమా షూటింగ్‌ని దాదాపు సగానికి పైగా కంప్లీట్ చేశాడు. పోలీస్ ఆఫీసర్ గా విభిన్నమైన పాత్ర పోషిస్తున్న రజనికి జోడిగా ఈ సినిమాలో నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. 


అయితే ఎవరైనా ఒక టాప్ డైరెక్టర్‌ని ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడగడం సర్వ సాధారణం. కానీ ఒక టాప్ హాలీవుడ్ యాక్టర్ ఇలా ఒక్క ఛాన్స్ అంటే మాతరం ఆశ్చర్య పోవాల్సిందే. ఇలానే రీసెంట్‌గా హాలీవుడ్ స్టార్ యాక్టర్ బిల్ డ్యూక్ మురుగదాస్ ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. రజనికి చిన్నపుడు అమెరికాలో తప్పిపోయిన కజిన్ గానో లేదా నయనతార అంకుల్ గానో దర్బార్ సినిమాలో ఒక్క ఛాన్స్ ఇమ్మని అడిగాడు. అంతేకాదు శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ తో తనను మార్చేసి అనిరుద్ రవిచందర్ సంగీతంలో ఒక పాట కూడా పెట్టమని..దీని గురించి ఓసారి ఆలోచించమని అడిగాడు.


అయితే ముందు ఇది ఫేక్ ట్వీట్ అనుకున్న మురుగదాస్ ఆ తర్వాత బిల్ డ్యూక్ అఫీషియల్ అకౌంట్ నుంచే చేసిన ట్వీట్ అని తెలుసుకుని షాక్ అయ్యాడు. రీ ట్వీట్ చేస్తూ సర్ ఇది మీరేనా అడిగింది అంటూ ఆశ్చర్యంగా ఎక్స్ ప్రెషన్ తో ఎమోజి పెట్టాడట. బిల్ డ్యూక్ ప్రెడేటర్ - ఎక్స్ మెన్ లాస్ట్ స్టాండ్ - ట్విలైట్ సిరీస్ ద్వారా ఎంత పాపులారిటీని సంపాదించుకున్న నటుడో అందరికి తెలిసిందే. ఇక బిల్ నిజంగా రావాలే కానీ మురుగదాస్ అదిరిపోయే క్యారెక్టర్‌లో పెట్టేస్తాడు. అందులో అనుమానం లేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: