ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సాహో సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.  టీజర్ ఎలా ఉంది అంటే సగటు అభిమాని సూపర్ అని అంటున్నారు.  అందుకు అంటున్నారు అంటే టీజర్ నచ్చింది.  వాళ్ళు టీజర్ బాగుంది నచ్చింది అన్నారు.  రివ్యూ చేసేవారు మాత్రం నిశితంగా పరిశీలించి చూస్తుంటారు.  


ఈ పరిశీలనలో అనేక విషయాలు మనకు కనిపిస్తుంటాయి.  ఈ టీజర్ లో ప్రధానంగా రెండు విషయాలను గుర్తించవచ్చు.  అదేమంటే ప్రభాస్ గెటప్.  ప్రభాస్ ట్రిమ్మింగ్ షేవ్ తో ఒకసారి కనిపిస్తాడు.  మరో ఫ్రేమ్ లో ఫుల్ గడ్డంతో ఉన్న సీన్ కనిపిస్తుంది.  ఆ సీన్స్ ను పక్క పక్కన పెట్టి చూస్తే.. 


ఇందులో ప్రభాస్ సింగిల్ కాదు.. డబుల్ అని అనుకోవచ్చు.  ఒకవేళ డబుల్ రోల్ అయితే.. సినిమా సస్పెన్స్ ఉంటుంది. లేదు సింగిల్ రోల్ మాత్రమే అనుకుంటే.. ఆ రోల్ ఎలా ఉంటుందో చూడాలి.  సస్పెన్స్ ను కలిగించే థ్రిల్లింగ్ స్టోరీ తో సినిమాను తెరకెక్కించారు.  


ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని విధంగా సినిమాను షూట్ చేశారు.  బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో క్రేజ్ పెరిగింది.  టీజర్ లో చూపించిన థ్రిల్లింగ్ ట్రైలర్ లో క్యారీ చేస్తూ.. ట్రైలర్ కూడా అదే విధంగా మెరుపులు మెరిపిస్తే సినిమా ఎక్కడికో వెళ్తుంది.  ఇక ప్రభాస్ అక్కడి నుంచి కిందకు రాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: