తారా సుతారియా.. బాలీవుడ్ కు కొత్తగా పరిచయమైనా నటి.  ఈ నటికి ఓ వింత అనుభవం ఎదురైంది.  స్టూడెంట్ అఫ్ ది ఇయర్ ఆమె తొలి సినిమా.  ఇందులో ఆమెతోపాటు టైగర్‌ ష్రాఫ్‌, అనన్యా పాండే ప్రధాన తారాగణంగా నటించారు. పునీత్‌ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 10న విడుదలై మంచి టాక్‌ అందుకుంది. 


ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లినప్పుడు ఎదురైన ఓ ఘటనను తారా తాజాగా బయటపెట్టారు. తన పక్కన కూర్చుని ఉన్న ఇద్దరు అమ్మాయిలు.. తన గురించి చాలా చెడుగా మాట్లాడారని అన్నారు.  ఓ సన్నివేశం చూసి వాళ్ళు అలా మాట్లాడుకున్నారట. 


అయితే పక్కన ఉన్నది తానే అని వాళ్లకు తెలియదు.  సినిమా పూర్తయ్యాక లైట్స్ వేశారట.  ఆ తరువాత తనని చూసి ఆ అమ్మాయిలు షాక్ అయ్యారట.  వాళ్ళవైపు చిరునవ్వి నవ్వి.. తారా వెళ్ళిపోయినట్టు చెప్పింది.  సినిమాలో ఇన్వాల్వ్ అయ్యినపుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.  


ప్రస్తుతం ఈ నటి మర్జావా సినిమాలో నటిస్తోంది.  దీంతో పాటు తెలుగులో మంచి విజయం సాధించిన ఆర్ఎస్ 100 రీమేక్ లో కూడా నటించాల్సి ఉంది.  తెలుగులో ఈ సినిమా బోల్డ్ కంటెంట్ తో అదరగొట్టింది.  పాయల్ కు ఈ సినిమాతో బోల్డ్ హీరోయిన్ గా పేరు వచ్చింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: