ఇండియన్ సినిమాలు కొన్ని ఫార్ములను తప్పకుండా ఫాలో అవుతుంటాయి.  హీరో ఇంట్రో, ఐదు ఫైట్స్, ఆరు సాంగ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్.. ఇవి తప్పకుండా ఉండాలి. వీటితో పాటు తప్పకుండా కామెడీ, లవ్ ఉండాలి.  ఇలా అన్ని ఉంటేనే మనవాళ్లకు సినిమా ఎక్కుతుంది.  


ఇంటర్వెల్ అన్నది మన సినిమాల్లో తప్పనిసరి.  ఎందుకంటే ఇంటర్వెల్ కు ముందు ఓ ట్విస్ట్ లేదంటే.. రాజమౌళి సినిమాల్లో లాగ భారీ ఫైట్ తీసి.. బ్రేక్ ఇస్తారు.. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనే దానిని ప్రేక్షకులు కాసేపు ఆలోచించుకోవడానికి, బయటకు వెళ్లి స్నాక్స్ గట్రా తీసుకోవడానికి కేటాయిస్తారు. 


రిలాక్స్ గా స్నాక్స్ తింటూ సెకండ్ హాఫ్ చూస్తారు.  ఇంటర్వెల్ పెట్టడానికి ఓ కారణం కూడా ఉంది.  థియేటర్స్ లో తినుబండారాల అమ్మకం జరగాలి అంటే ఇంటర్వెల్ ఉండాల్సిందే.  అయితే, ఓ హిందీ సినిమాలో ఇంటర్వెల్ లేదు. దాదాపు ఒక గంట 45 నిమిషాల నిడివికలిగిన సినిమాను ఇంటర్వెల్ లేకుండా లాగించేశారు.  


ఆ సినిమానే దోభి ఘాట్. అమిర్ ఖాన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు ఆయన భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించారు.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  అద్భుతమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లో ను ఆపడం ఎందుకులే అని చెప్పి బ్రేక్ ఇవ్వకుండా సినిమాను కంటిన్యూ చేశారట.  బహుశా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలా ఇంటర్వెల్ లేకుండా తీసిన సినిమా ఇదొక్కటే కాబోలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: