ఈమధ్య కాలంలో భారీ సెట్స్  లేకుండా సినిమాలు తీయడం లేదు.  ముఖ్యంగా, భారీ బడ్జెట్ సినిమాలు. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించుకొని, గ్రీన్ మ్యాచ్ వేసి షూట్ చేస్తున్నారు.  విజువల్ ఎఫెక్స్ లో వాటిని సెట్ చేస్తున్నారు.  

అయితే, సినిమాకు ఎఫెక్ట్స్ అవసరం ఉంది.  కానీ, సెట్ న్యాచురల్ గా ఉంటేనే దానికి క్వాలిటీ ఉంటుంది.  దీనిని నమ్మిన మమ్మూట్టి తన మమాంగం సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ జోలికి వెళ్లకుండా.. భారీ సెట్ ను నిర్మించారు.  కోట సెట్స్ లోనే గ్రీనరికి సంబంధించిన అన్ని లైవ్ లో చూపించాలని అనుకున్నారు. 

దీనికోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెట్ వేశారట. ఆ సెట్ లోనే సినిమా చేస్తున్నారు.  ప్రాచీన యుద్ధ కళలో నైపుణ్యం కలిగిన కొంతమంది యోధులకు, అప్పటి రాజులకు మధ్య జరిగిన యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. 

ఈ సినిమా కోసం మమ్మూట్టి ప్రత్యేకంగా ఆ కళను నేర్చుకున్నారు.  గ్రీన్ మ్యాట్ వంటివి వాడకుండా సెట్స్ లోనే సినిమా చేస్తున్నారు కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టదు.  అందుకే సినిమా ను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.  దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: