విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరోగా అందరూ అభిమానిస్తారు. ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా పాత్రలను ఎంపిక చేసుకుంటారు. అంతే కాదు. ఏ పాత్ర వేసినా తనకోసమే అన్నాట్లుగా ఉంటుంది. మంచి టైమింగ్ కమిట్మెంట్ ఉన్న వెటరన్ యాక్టర్ వెంకటేష్ 


ఎఫ్ 2 మూవీ గ్రాండ్ సక్సెస్ తో వెంకీ మళ్ళీ ఫాం లోకి వచ్చేశాడు. ఇపుడు వెంకీ చేతిలో నాలుగైదు  ప్రాజెక్టులు ఉన్నాయి. ఫుల్ బిజీ, సొంత మేనల్లుడు నాగ చైతన్యతో వెంకీ మామ సెట్స్ మీద ఉంది. ఇదిలా ఉండగా బాలీవుడ్లో హిట్ అయిన దే దే ప్యార్ దే  అజయ్ దెవగన్ మూవీ ని తెలుగులో రిమేక్ చేయాలని వెంకీ భావిస్తున్నాడుట. ఈ మూవీ  యాభయ్యేళ్ళ ఓ వయసు మళ్ళిన హీరో యంగ్ హీరోయిన్ తో ఘాటు రొమాన్స్ చేస్తాడు.


అక్కడ అజయ్ దేవగన్ తో పాటు టబు, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఘాటు మసాలా  రోమాన్స్ అక్కడ రకుల్ చేసింది. ఇపుడు చాన్స్ వెంకీది. ఆయన కూడా రకుల్ కావాలంటున్నాడుట. మరో విశేషం ఏంటంటే టబు కూడా వెంకీతో నటిస్తుందని టాక్. ఈ ఇద్దరూ కలసి నటించి అపుడే 28 ఏళ్ళు గడచిపోయాయి. మొత్తానికి  రకుల్ తో వెంకీ చేసే ఈ హాట్ హాట్ రొమాన్స్ ఎలా ఉంటుందో అని అపుడే ఇంటెరెస్ట్ పెరిగిపోయింది. ఈ మూవీని సురేష్ మూవీస్ ప్రొడ్యూస్  చేస్తుంది, బాలయ్య డిక్టేటర్ డైరెక్టర్ శ్రీవాస్  డైరెక్ష‌న్లో సెట్స్ మీదకు తొందరలో వెళ్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: