కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో సూపర్ హిట్ సినిమా సీక్వల్ గా వస్తున్న సినిమా మన్మథుడు-2. చిలసౌ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన రాహుల్ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడట. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 60 ఏళ్ల వయసులో కూడా నాగార్జున రొమాన్స్ పండిస్తూ అదరగొట్టాడు.


ఇంతకీ ఈ వయసు మళ్లిన మన్మథుడితో లిప్ లాక్ చేసిన ఆ అమ్మడు ఎవరో తెలుసా.. టీజర్ లో నాగ్ లిప్ లాక్ చేసిన ఆ హీరోయిన్ రకుల్, కీర్తి సురేష్ ఇద్దరిలో ఎవరా అన్న ఎక్సైటింగ్ ఆడియెన్స్ లో ఉంది. అందుకే ఆమె ఫేస్ రివీల్ అవకుండా జాగ్రత్త పడ్డారు. కాని ఇక్కడ విశేషం ఏంటంటే నాగ్ తో లిప్ లాక్ చేసింది ఆ ఇద్దరు కాదని తెలుస్తుంది.


మన్మథుడు-2లో రకుల్ మెయిన్ హీరోయిన్ కాగా కీర్తి సురేష్ కూడా ఓ స్పెషల్ రోల్ లో నటిస్తుంది. సినిమాలో సమంత కూడా చిన్న కెమియో రోల్ చేస్తుంది. అయితే నాగ్ తో లిప్ లాక్ చేసింది మాత్రం అక్షర గౌడ అని తెలుస్తుంది. మన్మథుడు 2లో అక్షర గౌడ కూడా నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. సో నాగార్జునతో అదరచుంభనాలు కానిచ్చింది ఆ అమ్మడే అని ఫిక్స్ అవుతున్నారు.


ఇక 60 కి దగ్గరగా ఏజ్ వచ్చినా గ్లామర్ విషయంలో నాగార్జున యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడని చెప్పొచ్చు. మన్మథుడు టైటిల్ కు పూర్తి న్యాయం చేసేలా ఈ సీక్వల్ ఉంది. ఆగష్టు 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై టీజర్ అంచనాలు పెంచగా సినిమా తప్పకుండా అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు చిత్రయూనిట్.



మరింత సమాచారం తెలుసుకోండి: