టిక్ టాక్ యాప్ ద్వారా తమలోని టాలెంట్ బయట పెడుతున్న వారిలో ఉప్పల్ బాలు ఒకడు. తనదైన స్టైల్ తో ఫాలోవర్స్ ను పెంచుకుని అలరిస్తున్న ఉప్పల్ బాలు ఇప్పుడు ఓ చిన్నపాటి సెలబ్రిటీగా మారాడు. టిక్ టాక్ లో చాలా పాపులర్ అయిన ఉప్పల్ బాలు ఈటివి ప్లస్ లో ఓ సీరియల్ లో ఛాన్స్ పట్టేశాడు.


అంతేకాదు జబర్దస్త్ లో కూడా బుల్లెట్ భాస్కర్ టీంలో సర్ ప్రైజ్ చేశాడు. జబర్దస్త్ ఫ్లాట్ ఫాం మీద ఎంతోమంది కమెడియన్స్ కు అవకాశాలు వచ్చాయి. తమలోని టాలెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తే చాలు వారికి కావాల్సినంత క్రేజ్ వచ్చేస్తుంది. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఉప్పల్ బాలు జబర్దస్త్ లో కూడా అలరించాడు. 


శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ లో నిర్మాత కొడుకుగా భాస్కర్ టీంలో స్కిట్ చేసిన ఉప్పల్ బాలు తనకు ఇచ్చిన పాత్రను ఉతికి ఆరేశాడు. ఓ మొబైల్ యాప్ ద్వారా తన టాలెంట్ బయట పెట్టి జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చేలాగా చేసుకున్నాడు ఉప్పల్ బాలు. తన వీడియోలు, డైలాగులు కొంచం తేడాగా ప్రవర్తించినట్టు ఉన్నా అలా చేయబట్టే జబర్దస్త్ దాకా రాగలిగాడు అని చెప్పొచ్చు.


శుక్రవారం జరిగిన ఎక్స్ ట్రా జబర్దస్త్ లో టీం సభ్యులందరు మంచి పర్ఫార్మెన్స్ తో అలరించారు. అందుకే అందరికి 10/10 ఇచ్చేశారు నాగబాబు, రోజా. ఎలక్షన్స్ వల్ల కొన్నాళ్లు జబర్దస్త్ కు దూరంగా ఉన్న నాగబాబు, రోజా మళ్లీ షో జజ్డులుగా కొనసాగుతున్నారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఈ రెండు షోలలో కమెడియన్స్ చేసే స్కిట్స్ తో పాటుగా నాగబాబు, రోజాల జడ్జ్ మెంట్ కూడా ఆడియెన్స్ ను మెప్పిస్తుంది.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: