బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమాతో ప్రభాస్ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది.  దేశ విదేశాల్లో ఆయనకు క్రేజ్ మామూలుగా లేదు. 

బాహుబలి రిలీజ్ అవకముందే తన తర్వాతి సినిమా" సాహో" అని ప్రకటించేశాడు.  అప్పటి నుండి "సాహో" కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. అయితే ఇంకొద్ది రోజుల్లో అభిమానుల ఆశ నెరవేరనుంది. 

ఇప్పటివరకు " సాహో" టీ నుండి ఒక టీజర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది వచ్చి చాలా రోజులవుతున్న కారణంగా చిత్ర యూనిట్ కొత్తగా మరో టీజర్ ని విడుదల చేసారు.  తెలుగు, తమిళ, హిందీ సహా మళయాళంలో కూడా ఈ టీజర్ విడుదలైంది.  ఏ భాషలో అయినా ఈ టీజర్ కి మంచి స్పందన వచ్చింది. 
 
విడుదల చేసిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. . ప్రపంచ వ్యాప్తంగా ఈ టీజర్ కి మంచి ఆదరణ లభించింది. తెలుగు అభిమానులు ఈ టీజర్ కి వచ్చిన స్పందన ని చూసి సంబర పడిపోతున్నారు.బాలీవుడ్ ప్రభాస్ కి ఉన్న కేజ్ చూసి బాలీవుడ్ నివ్వెర పోతుంది. బాలీవుడ్ మీడియా సాహో టీజర్ ని విపరీతంగా ప్రమోట్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: