బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ పెరిగిపోయింది. ఒక తెలుగు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ చేసాడు. తెలుగు సినిమాకి ఇన్ని కలెక్షన్లు సాధిస్తుందా అని అందరూ నోరెళ్ళబెట్టుకున్నారు. ఇండియన్ సినిమాపై అంతటి ప్రభావాని చూపించింది. దానికి కారణం రాజమౌళి. మరి అటువంటప్పుడు బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాకి ఇంకెన్ని అంచనాలు ఉంటాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది.
 
ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాని దుబాయ్ కంపెనీ రిలీజ్ హక్కులను కొనుక్కుందట. కానీ ఇది ఎంత వరకు నిజమో ఇంతవరకు తెలిసి రాలేదు. దీని మీద ఇంత వరకు ఎవ్వరు క్లారిటీ ఇవ్వలేదు. దుబాయ్ కి చెందిన  ఫార్స్ ఫిల్మ్ కొ ఎల్ ఎల్ సి లిమిటెడ్ అనే కంపెనీ మళయాళం మరియు ఇంగ్లీష్ సినిమాలను గల్ఫ్ లో విడుదల చేస్తుంది.
 
అయితే ఇదే కంపెనీ బాహుబలి సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రపంచవ్యాప్తంగా ఇండియా, చైనా మినహాయించి విడుదల చేయడానికి 65 కోట్లకి కొనుక్కుందట. దీనిపై అటు నిర్మాత దానయ్య నుండి కానీ, దర్శకుడు రాజమౌళి నుండి కానీ ఎటువంటి రిప్లై రాలేదు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది నంబర్లు కూడా ఎలా లీక్ అయ్యాయని.
 
 
అయితే సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి చేస్తున్న  పబ్లిసిటి స్టంట్  అయ్యుంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా రాజమౌళి ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు.  దానయ్య భారీ హంగులతో ఈ సినిమాకి డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనక్కి రావట్లేదంట. జూ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుంది. ఇంకో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలిసి రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: